Monday, April 29, 2024

‘స్కంద’ షూటింగ్‌ పూర్తి

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ పోతినేని నటిస్తున్న చిత్రం ‘స్కంద’. తన హీరోలను మునుపెన్నడూ చూడని మాస్‌ గెటప్‌లలో చూపించడంలో పేరున్న బోయపాటి, రామ్‌ని పూర్తిగా డిఫరెంట్‌ లుక్‌ లో చూపిస్తున్నారు.

ఇటీవల ప్రధాన జంటపై చివరి పాట చిత్రీకరించారు. దీంతో ‘స్కంద’ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ మొత్తం పూర్తయింది.

చిత్రబృందం ఇప్పుడు సినిమా ప్రమోషన్‌ ప్రారంభించనుంది. మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇది పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ కాబట్టి దేశవ్యాప్తంగా ఇతర భాషల్లో కూడా దీన్ని జోరుగా ప్రచారం చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి, సినిమా చూడాలనే ఆసక్తి మరింత పెంచడానికి రెగ్యులర్‌ అప్‌డేట్‌లతో ముందుకు రావాలని ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌.

- Advertisement -

శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌ డిటాకే కెమెరామెన్‌ గా పని చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement