Saturday, December 7, 2024

ఈ సినిమా చేయడం నా బాధ్యత అనిపించింది – వరుణ్‌ తేజ్‌

వరుణ్‌తేజ్‌ నటిస్తున్న థ్రిల్లర్‌ ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. సాక్షి వైద్య హీరోయిన్‌. ఈనెల 25న విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఈ సినిమా -టైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా..వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ ”గాండీవధారి అర్జున -టైలర్‌ అందరికీ నచ్చే ఉంటు-ందని అనుకుంటు-న్నాను. ప్రవీణ్‌ సత్తారు ఈ కథ చెప్పినప్పుడు బాగా నచ్చేసింది. 2023లో జరిగిన ఓ ప్రాబ్లమ్‌ గురించి సినిమా తీస్తున్నప్పుడు ఓ నటు-డిగా అలాంటి సినిమా చేయటం నా బాధ్యతగా అనిపించింది. -టైలర్‌ చూసి యాక్షన్‌ మాత్రమే ఉంటు-ందని అనుకోవద్దు. దానికి మించి సినిమాలో చాలానే ఉన్నాయి. సినిమా అందరికీ నచ్చుతుంది. ‘గాండీవధారి అర్జున’ సినిమా షూటింగ్‌ ఎక్కువ భాగం విదేశాల్లో జరిగింది. ఇందులో నేను బాడీగార్డ్‌ పాత్ర చేశాను. ఓ వారంలో జరిగే కథ ఇది. అన్నారు.

నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ”గాండీవధారి అర్జున’ సినిమాలో మంచి సోషల్‌ మెసేజ్‌ ఉంది. యూరప్‌, అమెరికాల్లో షూటింగ్‌ చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది.” అన్నారు.

చిత్ర దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు మాట్లాడుతూ ”భూమిపై ఉన్న వనరులను మన ఇష్టానుసారం వాడేస్తున్నాం. భవిష్యత్‌ తరాల గురించి మనం ఆలోచించటం లేదు. గ్లోబల్‌ వార్మింగ్‌ గురించి జనరలైజ్‌ చేసి సినిమాను తెరకెక్కించాం” అన్నారు.

ఇంకా నటు-డు నరైన్‌, హీరోయిన్‌ సాక్షి వైద్య, ఆర్ట్‌ డైరెక్టర్‌ కామేష్‌ తదితరులు చిత్ర విజయాన్నికాంక్షిస్తూ మాట్లాడారు

Advertisement

తాజా వార్తలు

Advertisement