Saturday, April 27, 2024

Siddharth ‘Chinna’ | రేపే ఓటీటీకి వ‌స్తున్న‌ చిన్నా.. ఎక్క‌డంటే !

థియేట‌ర్ల‌లో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని అందుకుంది సిద్ధార్థ్ ‘చిన్నా’. త‌మిళంతో చిత్తా పేరుతో రూపొందిన ఈ సినిమాను చిన్నా పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. మెసేజ్ ఓరియెంటెడ్ థ్రిల్ల‌ర్ మూవీగా ద‌ర్శ‌కుడు ఎస్ యు అరుణ్ కుమార్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. కాగా, ఈ సినిమా ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో రేపు (నవంబర్ 28) రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో చిన్నా మూవీ స్ట్రీమింగ్ కానుంది.

ఈ కథలో హీరో అన్నయ్య చనిపోవడంతో ఆయన భార్యాబిడ్డల బాధ్యత హీరోపై పడుతుంది. ఆ ఫ్యామిలీకి న్యాయం చేయడానికి హీరో నానా కష్టాలు పడుతుంటే, ఓ చిన్నారిని లైంగిక దాడి చేశాడనే కేసులో అతను చిక్కుకుంటాడు. అలాంటి పరిస్థితిలో నుంచి అతను ఎలా బయటపడ్డాడనేదే కథ.

- Advertisement -

ఈ కేసు విచారణ జరిగే తీరు .. హీరోను వెంటాడే సన్నివేశాలు ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతూ వెళతాయి. ఈశ్వర్ పాత్రలో సిద్ధార్థ్ నటన ఆకట్టుకుంటుంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో నిమిషా సజయన్ .. బేబీ సహస్ర .. అంజలి నాయర్ కనిపిస్తారు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతాన్ని అందించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement