Thursday, May 9, 2024

ఐటెం సాంగ్ కు కోటి…

అగ్రహీరోలు నటించే భారీ సిని మాల్లో ఐటమ్‌ పాటలుంటాయి. వీటి కి ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంటుంది. హీరో ఎవరైనా సరే ఐటమ్‌ పాట ఉండాల్సిం దే. ఈ తరహా పాటలు కొత్తకాదు. గతంలో జయమాలిని, స్మిత వంటి తారలు చేశారు. ఇప్పుడు మాత్రం హీరోయిన్‌ ఇమేజ్‌ ఉన్న వారితోనే ఐట మ్‌ పాటల్లో నటింప జేస్తున్నారు. ఇలా తీస్తే ప్రత్యేక మైన క్రేజ్‌ ఉంటుందని, అభిమానులు ఎ గబడి చూస్తారని మే కర్స్‌ నమ్మకం. ఇకపోతే నటి శ్రియ ఐటమ్‌ పాటల చేయనున్నట్టు తెలిసిం ది.
చిరంజీవి భోళాశంకర్‌లో ఆమె నర్తించ నుందని సామాజిక మాధ్య మాల్లో ప్రచారం అవుతోంది. ఇష్టం (2001) సినిమాతో కెరీర్‌ మొదలెట్టిన శ్రియ అడపాదడపా సిని మాలు చేస్తూనే ఉంది. ఆమె బ్యాచ్‌కి చెందిన నాయికలు కనుమరుగయ్యా రు. శ్రియ మాత్రం ఇంకా కొనసాగు తోంది. ముఖ్యంగా సీనియర్‌ హీరోల తో అవకాశాలు దక్కించుకుంటోంది. ఇటీవలే కబ్జ లో కీలకమైన పాత్ర చేసింది. ఇది కన్నడ సినిమా అయినా తెలుగులో వచ్చింది. ఇకపోతే భోళాశంకర్‌లో శ్రియ నటిస్తుం దా? లేదా అనేదానిపై స్పష్టత లేదు. అయితే ఈ పాటలో చేసేందుకు ఆమె కోటిరూ పాయలు డిమాండ్‌ చేసిందని మాత్రం ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తెలుగు సినిమాలన్నీ పాన్‌ ఇండియాగా రూపొందుతున్నాయి. ఒక భాషలో నటిస్తే భార తీయ భాషలన్నింటిలో నటించినట్టే కాబట్టి నాయికలు ఎక్కువ డిమాండ్‌ చేస్తున్నా రని సినీ వర్గాలు అంటున్నాయి. ఇక శ్రియ ఐటమ్‌ పాటలు చేయడం కొత్తకాదు. ఆమె పదేళ్ల క్రితమే జిల్లా ఘజియాబాద్‌ అనే హిందీ చిత్రంలో పాటలో నటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement