Sunday, April 28, 2024

నాగచైతన్య కు నో చెప్పిన కృతి శెట్టి

ఉప్పెన సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకుంది హీరోయిన్ కృతి శెట్టి. ఈ సినిమా కృతికి మొదటి సినిమా కావడం విశేషం. అయితే ఈ అమ్మడికి ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి. టాలీవుడ్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సుధీర్ బాబు నాని సినిమాలో కూడా నటిస్తోంది. ఇక తాజాగా అక్కినేని నాగచైతన్య సినిమాలో కూడా ఓ ఆఫర్ వచ్చిందట. కానీ కృతి అందుకు నో చెప్పినట్లు తెలుస్తోంది.

అక్కినేని నాగార్జున కెరీర్ లో మంచి హిట్ గా నిలిచిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగచైతన్య కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో నాగచైతన్య సరసన నటించడానికి కృతి శెట్టిని అడిగారట. కానీ ఆమె మాత్రం అందుకు నో చెప్పిందట. బిజీ షెడ్యూల్ వల్ల ఆ ఆఫర్ కు నో చెప్పినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement