Saturday, April 27, 2024

ఊయల తాడు తెగి లోయలో పడ్డారు..

ఎత్తైన కొండ.. కొండ అంచున ఊయల..పర్యాటక ప్రాంతం కావడంతో అక్కడికి వచ్చిన వారందరు కూడా ఓ సారి ఊయల ఊగి ప్రకృతి అందాన్ని గాల్లో విహరిస్తూ ఆస్వాధిస్తున్నారు…అయితే ఓ ఇద్దరు మహిళలు ఊగుతుండగా గొలుసులు ఊడాయి. దీంతో వారిద్దరూ కొండ అంచు నుంచి కింద పడిపోయారు. అయితే అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డారు. రష్యాలోని డాగేస్టాన్‌లో ఈ ఘటన జరిగింది. ఈ పర్యాటక ప్రాంతంలో 6300 అడుగుల ఎత్తైన కొండ అంచున సులక్ కాన్యన్‌ను ఏర్పాటు చేశారు. టూరిస్ట్‌లు కొండ అంచు నుంచి కింద ఉన్న లోయ మీదుగా ఉయ్యాల ఊగి థ్రిల్‌ పొందుతుంటారు.

ఎలా జరిగిందంటే..ఇద్దరు మహిళలు చెక్క ఉయ్యాలపై కూర్చోగా ఒక వ్యక్తి దానిని తోశాడు. ఆ ఇద్దరూ తొలుత ఉయ్యాల ఊగి బాగానే ఎంజాయ్‌ చేశారు. కొంతసేపటి తర్వాత ఆ వ్యక్తి ఉయ్యాలను బలంగా తోశాడు. దీంతో ఉయ్యాల గొలుసులు ఊడటంతో అందులో ఉన్న ఇద్దరు మహిళలు కొండ అంచు నుంచి కిందకు పడిపోయారు. అయితే అంచు కింద ఉన్న చిన్నపాటి చెక్కపై వారిద్దరు పడటంతో స్వల్పంగా గాయపడ్డారు. ఒకవేళ ఉయ్యాల బాగా ఎత్తులో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగి ఉంటే లోయలో పడటంతోపాటు వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. కాగా, ఆ ఉయ్యాలకు తగిన భద్రతా ఏర్పాట్లు లేవని, అందుకే మహిళలు పడిపోయారని డాగేస్టాన్‌ పర్యాటక మంత్రి తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపడంతోపాటు పర్యాటకుల ప్రాణాలకు ఎలాంటి హాని కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఒళ్లు జలదరింపజేసే ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

https://twitter.com/Random_Uncle_UK/status/1415209072090042372
Advertisement

తాజా వార్తలు

Advertisement