Sunday, May 5, 2024

పేద ప్రజలకు షకీలా సహాయం

దేశంలో కరోనా మహమ్మారి పేద ప్రజలను అతలాకుతలం చేస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. చేయడానికి పనులు లేక తినడానికి తిండి లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ కష్టకాలంలో పేద ప్రజలకు సహాయం చేయడానికి ఎంతో మంది సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా సినీ నటి షకీలా తన వంతు సహాయం చేయడానికి ముందడుగు వేశారు. పేదవారికి ఆహారాన్ని పంపిణీ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్, అభిమానులుఅందరూ ఆమె పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా కరోనా కష్టకాలం లో ఇబ్బంది పడుతున్న వారికి తోచిన సహాయం చేయమని కోరారు షకీలా.

Advertisement

తాజా వార్తలు

Advertisement