Thursday, April 25, 2024

సోను సూద్ కమర్షియల్ అనుకున్నా….తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు

రియల్ హీరో సోనుసూద్ పై సీనియర్ దర్శకుడు ,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమ్మారెడ్డి కొన్నేళ్ల క్రితం సోనూసూద్ చేసిన ఓ పని గురించి చెబుతూ సోనుసూద్ ఓ కమర్షియల్ అన్నారు. వికలాంగుల కోసం నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి సోనూసూద్ ను విచ్చేయవలసిందిగా ఆహ్వానం పంపారట తమ్మారెడ్డి. కానీ సోనుసూద్ దానికి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడట. దీంతో సోనూ చాలా కమర్షియల్ అనే ఒక ఒపీనియన్ వచ్చానని… కానీ ఇప్పుడు చూస్తుంటే తన అభిప్రాయం మారిపోయిందని చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి.

ప్రజలకు సహాయం చేయడానికి తన ఆస్తులు కన్నా ఎక్కువ ఖర్చు చేస్తున్నాడని అన్నారు. ఇక సోనుసూద్ కరోనా ఫస్ట్ వేవ్ లో ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేసి దేవుడయ్యాడు. ఇక సెకండ్ వేవ్ లో ఎంతోమందికి ఆక్సిజన్ మందులను పంపిణీ చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement