Sunday, April 28, 2024

అన్న‌పూర్ణ ఫొటో స్టూడియో నుండి.. లిరిక‌ల్ సాంగ్

అన్న‌పూర్ణ ఫొటో స్టూడియో నుండి లిరిక‌ల్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. భూమికి అందం ఊరు .. ఊరుకు అందం పైరు .. కొండల్లో దూకే సెలయేరు’ అంటూ ఈ పాట సాగుతోంది. ప్రిన్స్ హ్యారీ కట్టిన బాణీ బాగుంది. శ్రీనివాస మౌళి సాహిత్యం .. సాయిచరణ్ ఆలాపన ఆకట్టుకుంటున్నాయి. పాటపై కట్ చేసిన పల్లె విజువల్స్ మనసుకు పట్టేలా ఉన్నాయి. యశ్ రంగినేని నిర్మించిన ఈ సినిమాకి చెందు ముద్దు దర్శకత్వం వహించాడు. చైతన్యరావు – లావణ్య లక్ష్మి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇది గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమకథ అనే విషయం టైటిల్ ను బట్టి చూస్తేనే అర్థమవుతోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

YouTube video

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement