Saturday, April 27, 2024

సెంటిమెంట్ నే నమ్ముకున్న ఎఫ్ 3

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఎఫ్2 . ఫన్ అండ్ ఫ్రస్టేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో తమన్నా మెహరీన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో కూడా విక్టరీ వెంకటేశ్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నారు. అలాగే అంజలి కీలక పాత్రలో నటిస్తోంది.

ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారంసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. సెంటిమెంట్ కూడా కలసి వస్తుందనే అలా చేయాలనుకుంటున్నారట. ఇటు అనిల్ కు, దిల్ రాజుకు సంక్రాంతి బాగా కలిసి వచ్చింది. మరి ఆ సెంటిమెంట్ ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement