Saturday, April 27, 2024

సమంత క్రేజ్ మాములుగా పెరగలేదు!!

హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం స్పీడ్ తగ్గించలేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. తాజాగా సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. కాగా ఇది సమంత కెరీర్ లోనే ఓ బిగ్గెస్ట్ ఫీడ్ బ్యాక్ ని అందుకుంది. నటిగా సమంతకు మంచి పేరును తీసుకొస్తున్నాయి.

మొత్తం సౌత్ ఇండియ ఇండస్ట్రీ అంతా సమంత పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్క అభిమానుల నుంచి కాకుండా సినీ ప్రముఖులు సహచర నటీనటులు అందరూ కూడా సమంత పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తం నేషనల్ వైడ్ గా సమంత నటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు హీరోయిన్ గా కూడా సమంత కొన్ని సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement