Thursday, March 23, 2023

కరోనా పై రాజమౌళి షార్ట్ ఫిల్మ్

దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ మహమ్మారి పై అవగాహన కల్పిస్తూ రాజమౌళి రకరకాల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

తాజాగా రాజమౌళి మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పై ఒక 19 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్ ను అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ పోలీస్ సహాయంతో తీయనున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో వైపు చిరంజీవి కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా డాక్టర్స్ పై ఓ షార్ట్ ఫిల్మ్ ను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement