Wednesday, May 8, 2024

బాలీవుడ్ ఆఫర్ రిజెక్ట్ చేసిన సాయి పల్లవి ?

ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సాయిపల్లవి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు నటన పరంగా మంచి పేరును తీసుకువచ్చింది. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్ లో మంచి జోష్ మీద ఈ అమ్మడు. అయితే ఇటీవల బాలీవుడ్ నుంచి వచ్చిన ఓ ఆఫర్ ను సాయి పల్లవి రిజెక్ట్ చేసిందట. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చత్రపతి రీమేక్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్స్ గా పలువురి పేర్లను పరిశీలించగా సాయిపల్లవి అయితే బాగుంటుందని భావించారట. ఈ నేపథ్యంలోనే ఆమె ని సంప్రదించారట. కానీ సాయిపల్లవి డేట్స్ సర్దుబాటు లేవని రిజెక్ట్ చేసిందట. అందుకుగాను ఈ సినిమా కోసం రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కూడా ఇస్తామని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement