Sunday, April 28, 2024

RGV : ఆర్జీవీ ఎవ‌ర్నీ వ‌ద‌ల‌డు ….

ఒకప్పటి సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ఇప్పుడు మాత్రం తాను తీసే కొత్త రకం సినిమాలు, తన సోషల్ మీడియా పోస్టులు, తన పార్టీలతో వైరల్ అవుతున్నాడు. ఆర్జీవీ ఏదైనా అమ్మాయిని పరిచయం చేసినా, ఎవరైనా అమ్మాయితో ఫోటోలు, పార్టీ వీడియోలు షేర్ చేసినా, ఇప్పుడు తాను తీసే సినిమాల్లో ఎవరైనా కొత్త అమ్మాయిలు పరిచయం చేసినా వాళ్ళు వైరల్ అవ్వాల్సిందే. ఇటీవల ఆర్జీవీ పరిచయం చేస్తున్న అమ్మాయి వైరల్ అయి బిగ్ బాస్ కి కూడా వెళ్తున్నారు.

- Advertisement -

తాజాగా ఓ ఇద్దరు భామలు ఇప్పుడు ఆర్జీవీతో ఫోటోలు దిగడంతో మరింత వైరల్ అవుతున్నారు. తాజాగా ఓ పబ్ లో నటి రీతూ చౌదరి, సురేఖ వాణి కూతురు సుప్రీత ఆర్జీవీతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆల్రెడీ ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో చాలా ఫేమస్. రీతూ తన సీరియల్స్, యూట్యూబ్ వీడియోలు, జబర్దస్త్ తోనే కాక సోషల్ మీడియాలో పెట్టె హాట్ హాట్ ఫొటోలతో బాగా వైరల్ అయింది. ఇక సురేఖ వాణి కూతురిగా సుప్రీత కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సుప్రీత కూడా త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.

ఇప్పుడు రీతూ చౌదరి, సుప్రీత ఆర్జీవీ తో పబ్ లో ఫోటోలు దిగి పెట్టడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆర్జీవితో కనపడ్డారంటే మీరు కూడా మరింత ఫేమస్ అయిపోతారు, మీకు కూడా బిగ్ బాస్ ఛాన్స్ వస్తుంది అని పలువురు నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీరిద్దరూ పబ్ లో మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియోని కూడా షేర్ చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement