Sunday, May 5, 2024

కోలుకుంటున్న బండ్ల గణేష్

ప్రముఖ నిర్మాత నటుడు బండ్ల గణేష్ కు రెండవసారి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తీవ్ర అస్వస్థతకు గురైన బండ్లగణేష్ ను జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. ఆయన ఆరోగ్య సమస్య దృష్ట్యా ఐసీయూలో పెట్టారు. అయితే మొదట బండ్ల గణేష్ ఆరోగ్యంపై ఆందోళన నెలకొనగా ఇప్పుడు మెల్ల మెల్లగా బండ్లగణేష్ కోరుకుంటున్నారట.

ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని వైద్యానికి స్పందిస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఐసీయూ నుంచి కూడా నార్మల్ వార్డ్ కు షిఫ్ట్ చేశారట. కాగా ఇటీవల వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ తన స్పీచ్ తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ భక్తుడిని అంటూ బండ్ల గణేష్ తనదైన శైలిలో పవన్ అభిమానులను ఆకట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement