Friday, May 24, 2024

శ్రీ‌లీలతో ర‌వితేజ‌ రొమాన్స్‌.. ‘ధ‌మాకా’పై పెరుగుతున్న అంచ‌నాలు

మాస్‌ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ధమాకా. త్రినాథరావు నక్కిన దర్శకుడు ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. రవితేజ, శ్రీలీల తొలి కాంబినేషన్‌ చిత్రమిది. ఈ చిత్రం నుండి ఇటీవల విడుదలైన మొదటి పాట ‘జింతాక్‌’కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ధమాకా చిత్ర యూనిట్‌ నుండి కొత్త అప్డేట్‌ ఇచ్చింది. ఈ చిత్రం గ్లింప్స్‌ బుధవారం విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ కలర్‌ఫుల్‌గా, రొమాంటిక్‌గా కనిపిస్తోంది. రవితేజ శ్రీలీలని తన దగ్గరికి తీసుకొని, ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తుండగా శ్రీలీల కాస్త టెన్షన్‌ పడుతూ అయోమయంగా చూడటం ఆకట్టుకుంది, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత. ‘డబుల్‌ ఇంపాక్ట్‌’ అనే ట్యాగ్‌లైన్‌ తో వస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందించగా, కార్తీక్‌ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement