Wednesday, May 29, 2024

HYD: త‌క్కువ ధ‌ర‌కే బంగారం.. హైద‌రాబాద్ లో మ‌రో ఘ‌రానా మోసం

హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రో ఘ‌రానా మోసం చోటుచేసుకుంది. త‌క్కువ ధ‌ర‌కే బంగారం అంటూ ఓ ముఠా ఘ‌రానా మోసానికి పాల్ప‌డింది. గోల్డ్ స్కీమ్ పేరుతో ఓ ముఠా ప‌లువురిని బురిడీ కొట్టించింది. రూ.4కోట్లు వ‌సూలు చేసుకొని కేటుగాళ్లు ప‌రార‌య్యారు.

రూ.50వేలు క‌ట్టి స్కీమ్ లో చేరితే 10శాతం ధ‌ర త‌గ్గిస్తామంటూ ఈ ముఠా అమాయ‌కుల‌ను న‌మ్మించింది. బంధువులు, స్నేహితుల నుంచి డ‌బ్బులు స్వాహా చేశారు. చివ‌ర‌కు రూ.4కోట్ల‌తో ముఠా స‌భ్యులు విశాల్, విన‌య్, నిఖిల్ లు ప‌రార‌య్యారు. బాధితులు సీసీఎస్ లో ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement