Sunday, October 20, 2024

AP: ఓట్లు లెక్కింపు ప్రక్రియలో సూపర్ వైజర్ల పాత్ర కీలకం… జిల్లా ఎన్నికల అధికారి

(ప్రభ న్యూస్ బ్యూరో), శ్రీకాకుళం, మే 29 : ఓట్లు లెక్కింపు ప్రక్రియలో సూపర్ వైజర్ల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జీలాని సమూన్ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి జూన్ 4న శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్లు లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఓట్లు లెక్కింపు సూపర్‌వైజర్లు, అసిస్టెంట్ సూపర్‌వైజర్లు రెండవ విడత శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జీలాని సమూన్, కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జీలాని సమూన్ మాట్లాడుతూ…. కచ్చితమైన, సమర్ధవంతమైన ఓట్ల లెక్కింపునకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలతో సిబ్బందిని సన్నద్ధం చేయడం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. సాధారణ ఎన్నికల 2024 సంబంధించి జిల్లాలో ఎలాంటి సంఘంటాల జరగకుండా ప్రశాంతంగా ఎన్నికల నిర్వహించిన అందరికి ధన్యవాదాలని తెలిపారు, ఎన్నికల నిర్వహణ స్ఫూర్తితో ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఓట్లు లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు.

- Advertisement -

శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రాలను వివిధ బ్లాక్ లలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి సెగ్మెంట్లలో ఓట్ల లెక్కింపుకు కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో ఏ సమస్య వస్తే వెంటనే ఆర్ఓ కు తెలియజేయాలన్నారు. శిక్షణా తరగతుల్లో పలువురు సూపర్‌వైజర్‌లు, అసిస్టెంట్ సూపర్‌వైజర్‌లు అడిగిన పలు సందేహాలను జాయింట్ కలెక్టర్, ఆముదాలవలస శాసన సభా నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఎం నవీన్ నివృత్తి చేశారు. ఈ శిక్షణా తరగతుల్లో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎం.వెంకటేశ్వర రావు, నోడల్ అధికారి ఎన్.బాలాజీ, మాస్టర్ ట్రైనర్లు శేష గిరి మెప్మా పిడి కిరణ్ కుమార్, ఓట్లు లెక్కింపు సూపర్వైజర్లు, అసిస్టెంట్లు సూపర్వైజర్లు తదితరులు హాజరయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement