Friday, October 4, 2024

Arasavelli – సూర్య‌నారాయ‌ణ స్వామికి అదిత్యుని స్ప‌ర్శ‌

అర‌స‌వెల్లిలో అధ్యాత్మిక అద్బుత ఆవిష్కారం
క‌నులారా వీక్షించిన భ‌క్త జ‌నం
రేపు కూడా సూర్య కిర‌ణాల దృశ్యం ..

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. లేలేత కిరణాలు పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి ఆదిత్యుని తాకిన దృశ్యాలను చూసి భక్తులు పులకించిపోయారు. ఉదయం 6.05 గంటలకు కొన్ని నిమిషాలపాటు ఆవిష్కృతమైన ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారురు. బుధవారం కూడా స్వామివారి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకే అవకాశం ఉందని పండితులు తెలిపారు. ఏటా రెండు సార్లు ఇలాంటి అద్భుతం ఆవిష్కృతమవుతుంది. ప్రతిఏటా మార్చి 9, 10 తేదీల్లో.. అలాగే అక్టోబర్ నెల 1, 2 తేదీల్లో భక్తులకు కనువిందు చేస్తుంది.


ఆదిత్యుని విగ్రహాంపై పడిన లేలేత కిరణాలు దర్శనమివ్వడంతో జన్మధన్యమైందంటూ భక్తులు సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. సూర్యకిరణాలు తాకే సమయానికి సూర్యనారాయణమూర్తిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఎప్పటినుంచో ఈ అద్భుతాన్ని చూడాలనుకున్నామని.. ఇప్పుడు ఆ భాగ్యం తమకు దక్కడం సంతోషంగా ఉన్నదని చెప్తున్నారు పలువురు భక్తులు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement