Wednesday, October 9, 2024

Arasavelli – రెండో రోజూ అదిత్యుడికి సూర్యాభిషేకం

అర‌స‌వెల్లిలో స్వామి వారి పాదాల‌కు సూర్య స్ప‌ర్శ‌
మూడు నిమిషాల పాటు ఆధ్యాత్మిక అద్భుతం
క‌నులారా వీక్షించిన భ‌క్త జ‌నం

శ్రీకాకుళం జిల్లాలోని ప్రత్యక్ష దైవం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆలయంలోని రెండో రోజు స్వామివారి మూల విరాట్ ను నేరుగా సూర్యకిరణాలు తాకాయి. లేలేత సూర్య కిరణాల స్పర్శతో స్వామివారి మూలవిరాట్ దేదీప్యమానంగా వెలుగొందింది. రెండు, మూడు నిమిషాలు పాటు స్వామివారి మూల విరాట్ ను సూర్య కిరణాలు తాకాయి. అద్భుత దృశ్యాలు భక్తులకు కనువిందు చేశాయి.

- Advertisement -

స్వామివారి మూలవిరాట్ ను సూర్యకిరణాలు నేరుగా తాకే సమయంలో చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రతీయేటా దక్షిణాయంలో అక్టోబర్ 1వ, 2వ తేదీల్లో ఉత్తరాయణంలో.. అదేవిధంగా మార్చి 9,10 తేదీల్లో సూర్యకిరణాలు మూల విరాట్ ను నేరుగా తాకుతాయి. అరసవెల్లి క్షేత్రంలో స్వామివారి మూల విరాట్టును సూర్య కిరణాలు నేరుగా తాకడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement