Tuesday, July 23, 2024

Meenakshi Chaudhary : మాయలో ప‌డేస్తుంది…

ఇటీవల కాలంలో తెలుగులో ప్రత్యేక గుర్తింపు పొందిన అందాల తారల్లో మీనాక్షి చౌదరి ఒకరు. ఏ డ్రెస్సులో కనిపించినా, ఈమె కుర్రాళ్ళ హృదయాలను కట్టిపడేస్తుంది. సినిమాల కన్నా సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో ఎక్కువగా అభిమానులను సంపాదించుకుంటోంది.

మిస్ ఇండియా హర్యానా టైటిల్ గెలుచుకున్న మీనాక్షి, మోడల్‌గా మంచి గుర్తింపు పొందిన తర్వాత 2019లో హిందీ సినిమా “అప్ స్టార్ట్స్” ద్వారా వెండితెరకు పరిచయమైంది.

- Advertisement -

అనంతరం, టాలీవుడ్ వైపు రాగా “ఇచ్చట వాహనములు నిలుపరాదు” సినిమాతో మొదట అడుగు పెట్టింది. రవితేజతో చేసిన “ఖిలాడి”లో నటించి, హిట్ 2 మరియు గుంటూరు కారం వంటి సినిమాలలో మెరిసి ప్రేక్షకుల మనసులు దోచుకుంది. మీనాక్షి తన గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఆమె నవ్వు, ఫోజులతో కుర్రాళ్ళను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. రీసెంట్‌గా పోస్ట్ చేసిన ఫోటోల్లో పెద్దగా గ్లామర్ చూపించకపోయినా, తన నవ్వుతోనే అందరిని ఆకట్టుకుంది.

ఫాలోవర్స్ పాజిటివ్ రియాక్షన్లు ఇస్తూ, ఆమె అందాన్ని ప్రశంసిస్తున్నారు. “నీ లుక్స్ తోనే మైమరచిపోయేలా చేస్తున్నావు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీనాక్షి ఎలా కనిపించినా అందమే అంటూ మరికొందరు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement