Saturday, June 22, 2024

జీవన నాటకంలో పాత్రధారులం…

ఈ విశ్వంలో నక్షత్ర గ్రహరాశులు అనేకం ఒక బంధంతో కలసి అనంత ప్రయాణం కొనసాగి స్తున్నాయి. అలాగే మనకు తెలిసిన ఈ భూగోళం లో మానవులు జీవరాశులతో కలసి అదే బంధంతో జీవి స్తున్నారు. సహజంగా దుర్లభమైన మానవజన్మ యొక్క అలౌకిక గమ్యం ఏ భావనా లేకుండా సాగిపోతుంది. పూర్వవాసనా ఫలితంగా కొంతమంది ఆ మాయ నుండి బయటపడి సత్యం తెలుసుకుంటారు. ఈ జగన్నాటక సూత్రధారి పరమాత్మ. ఆస్తికుడైనా, నాస్థికుడైనా ”ఆ పర మాత్మ” ప్రస్థావన లేకుండా జీవితాన్ని ముగించలేడు. జగన్నాటకంలో జీవిత రంగస్థలం ఎక్కడ తప్పదు, నటించక తప్పదు. ”బంధం” అనే దర్శకుని దర్శకత్వం లో నవరసాలను అభినయించాలి. ప్రథమంగా లభించే పాత్రలు స్త్రీ లేక పురుషు డు. నాటకం అనంతమని రంగుపూసుకున్నపుడే అవగతమవుతుంది. ఇక తమ పాత్రలు దు:ఖాంతం చేసుకోవాలా? సుఖాంతం చేసుకోవాలా అనేది దర్శకుని ఆదే శానుసారం నడుస్తుంది. ముగింపు మాత్రం పాత్రధారికే అప్పగించాడు. జీవన నాటకంలో అనేక పాత్రలు వేయక తప్పదు. పురుషుడయితే బాలుడు, యువకు డు, మధ్యవయస్కుడు, వృద్ధుడు ఇవి తప్పనిసరి. ఇక తమ నటనాకౌశలాన్ని ప్రద ర్శించడానికి కొడుకు, అన్న, తమ్ముడు, అల్లుడు, మేనమామ, తండ్రి, తాత, మన వడు, బావ, మరిది ఇలా అనేక పాత్రలు సిద్ధంగా ఉంటాయి. ఇవికాక రంగస్థల నిర్వహణ కొరకు గురువు, రైతు, సైనికుడు ఇలా మరికొన్ని పాత్రలు ధరించాలి.
స్త్రీ అయితే బాలిక, కన్య, ప్రౌఢ, వృద్ధురాలు ఇవి తప్పనిసరి. కూతురు, అక్క, చెల్లి, కోడలు, మేనత్త, అమ్మ, అమ్మమ్మ, మామ్మ, మనుమరాలు, వదిన, మర దలు ఇలా అనేక పాత్రలు ధరించక తప్పదు. పురుషుని కంటే స్త్రీ పాత్రలు చాలా క్లిష్టమైనవి. అపూర్వమైనవి, బాధ్యత కలవి. ఇవికాక రంగస్థల నిర్వహణ కొరకు అనేక పాత్రలు ధరించక తప్పదు. పురుషుని కంటే స్త్రీ పాత్రలు చాలా క్లిష్టమైనవి. అపూర్వమైనవి, బాధ్యత కలవి. ఇవికాక రంగస్థల నిర్వహణ కొరకు అనేక ప్రత్యేక పాత్రలు తప్పనిసరి. ఇక అందరూ పాత్రధారులైతే ప్రేక్షకులెవరు? అనే ప్రశ్న ఉదయించక మానదు.
పాత్రధారులు, ప్రేక్షకులు పరస్పరం మారుతుంటారు. ఒకరి నట నను ఒకరు అభినందించుకుంటారు, విమర్శించుకుంటారు. తమ నటనా కౌశలాన్ని, నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మూల వాఙ్మయాన్ని అధ్యయనం చేస్తారు. అత్యంత కష్టతరమైన, ఎక్కువ నిడివి గల పాత్రలు భార్య భర్త అని తెలుసుకుంటారు.
పై పాత్రలన్నీ బంధం అనే దర్శకుని పర్యవేక్షణలో నడుస్తాయని తెలుసుకుంటారు. జీవితం ఒక నాటక రం గమైనా నటన కంటే జీవిస్తేనే పాత్రలు ఆనందంగా ముగుస్తాయి. ఒక్కడివే నటించేస్తే సరిపోదు. ఎదుటి పా త్రను కూడా ప్రోత్సహించాలి. సంభాషణలో పరస్పరం సహరించుకోవాలి. నీ నటనా ధోరణిలో నువ్వు పయని స్తే ప్రక్కనున్న పాత్రధారి అసూయకు లోనవుతాడు. నీ నటనలో జీవించాలనే ప్రయత్నాన్ని తీవ్రంగా ఆటంక పరుస్తాడు. అందుకే నటనలోని మెళకువలను ఇచ్చి పుచ్చుకోవడం తప్పనిసరి.
ఇక ఏ పాత్రలోనైనా అతిగా నటిస్తే అభాసు పాలవ క తప్పదు. దర్శకుడు ఎంతవరకు నియంత్రిస్తాడో అంతవరకే పరిమితం అవ్వడం వివేకం. పాత్ర ముగిసి ఆహార్యాలు తీసివేసిన తరువాత దర్శకుని అనుమతి లేకుం డా తిరిగి వేదిక ఎక్కకూడదు.
పరమాత్మ అంతిమంగా ముగింపు గీతాన్ని ఆలపింపచేసి పాత్రకు తగిన పా రితోషకం అందిస్తాడు. అద్భుతంగా నటించి, పాత్రను అలరింపచేసి సుఖాంతం చేస్తే పరమపదమనే బహుమతి ప్రదానం చేస్తాడు. ఏమాత్రం అయినా పరస్పరం సహకారం, గౌరవం, ప్రేమ, అభిమానం, త్యాగం, మితం మొదలయినవి ఇచ్చి పుచ్చుకొన్నపుడే నాటకం రక్తి కడుతుంది. నవరసాలు కురుస్తాయి. ఆనందమయ మయిన అనుభవం అనుభూతిగా మిగులుతుంది. పశ్చాత్తాపాలు, క్షమాపణలు లేకుండా ఒక గొప్ప ప్రేక్షకునిగా పరమాత్మ సరసన స్థానం లభిస్తుంది. అయితే రంగస్థలాన్ని భక్తి భావంతో అధిరోహించడం చాలా ముఖ్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement