Wednesday, May 29, 2024

America : రోడ్డు ప్రమాదంలో మరో తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో భారత్‌కు చెందిన తెలుగు విద్యార్ధి బైక్‌ ప్రమాదంలో మృతి చెందాడు. ఏపీకి చెందిన బెలెం అచ్యుత్ అనే యువకుడు అమెరికాలోని న్యూయార్‌ నగరంలోని న్యూయార్క్‌ స్టేట్‌ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

- Advertisement -

ఈ ప్రమాదంలో అచ్యుత్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అచ్యుత్‌ మృతి చెందిన విషయాన్ని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఈ మేరకు అధికారిక ఎక్స్‌ ఖాతా ద్వారా వెల్లడించింది.

న్యూయార్క్‌ స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి అచ్యుత్‌ బైక్‌ ప్రమాదంలో బుధవారం మధ్యాహ్నం మృతి చెందడం విచారకరం. అతడి అకాల మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాం. మృతుడి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం.

బాధిత కుటుంబం, స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహాన్ని త్వరలో భారత్‌కు పంపించేందుకు అచ్యుత్‌ కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని’ కాన్సులేట్‌ జనరల్‌ ‘ఎక్స్‌’ పోస్టులో పేర్కొన్నారు. కాగా అగ్రదేశంలో గత కొంతకాలంలో భారతీయ విద్యార్ధుల వరుస మరణాలు ఆందోళ కలిగిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ చదువుతున్న పలువురు విద్యార్ధులు పలు సంఘటనల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement