Wednesday, May 29, 2024

AP : రోడ్డు ప్ర‌మాదంలో విద్యార్థులకు తీవ్ర గాయాలు

తుగ్గలి, మే 24 (ప్రభ న్యూస్): ప‌దో త‌ర‌గ‌తి సప్లమెంటరీ ప‌రీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థులు రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యాడు. ఈ ప్ర‌మాదంలో వారికి తీవ్ర గాయాల‌య్యాయి. చికిత్స నిమిత్తం విద్యార్థులను ఆసుప్ర‌తికి త‌ర‌లించారు.

- Advertisement -

సూర్య‌తండాకు చెందిన విద్యార్థి గ‌ణేష్ నాయ‌క్ పదో త‌ర‌గ‌తిలో ప‌రీక్ష త‌ప్పాడు. ఆ ప‌రీక్ష‌ను రాసేందుకు ఇవాళ మండ‌ల కేంద్ర‌మైన తుగ్గ‌లి జ‌డ్పీ పాఠ‌శాల‌కు వెళ్లేందుకు బ‌య‌ల్దేరాడు. ఈ క్ర‌మంలో తన మిత్రులు సూర్య తండ చరణ్ నాయక్, బాడతాండ చరణ్ నాయక్‌లతో కలిసి ద్విచక్ర వాహనంపై తుగ్గలికి వస్తుండగా గుత్తి పత్తికొండ రహదారి పై పంజాబ్ డాబా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో వారు ముగ్గురు తీవ్ర గాయాలు గురయ్యారు. దీంతో వారు అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గణేష్ నాయక్ పరీక్షలకు హాజరు కాలేకపోయారు. ఈ విషయంపై తుగ్గలి ఎస్సై మల్లికార్జున కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement