Thursday, May 30, 2024

Tirumala : కొన‌సాగుతున్నభ‌క్తుల ర‌ద్దీ…3కిలోమీట‌ర్ల మేర క్యూలైన్‌

తిరుమ‌ల‌లో భక్తుల ర‌ద్దీ కొన‌సాగుతుంది. ఇవాళ కూడా శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు పోటెత్తారు. సుమారు 3కిలోమీట‌ర్ల మేర క్యూలైన్‌లో భ‌క్తులు శ్రీవారి ద‌ర్శ‌నం బారుతీరారు. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు క్యూ కొన‌సాగుతుంది.

వీరికి శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని తితిదే ప్రకటించింది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. ఈ రద్దీ వారాంతం వరకు కొనసాగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement