Wednesday, May 29, 2024

AP: ఆస్తి కోసం అన్నదమ్ముల మ‌ధ్య గొడవ.. తమ్ముడు మృతి

ప్రకాశం : ఆస్తి కోసం అన్నదమ్ములు గొడ‌వ ప‌డ‌డంతో తమ్ముడు మృతిచెందిన ఘ‌ట‌న‌ శుక్రవారం ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలంలో జరిగింది. శింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామపంచాయతీలోని వెంకటేశ్వర కాలనీలో ఆస్తుల తగాదా విషయంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది.

ఈ ఘర్షణలో తమ్ముడు చొప్పర శివశంకర్‌ మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని సీఐ దాచేపల్లి రంగనాథ్‌, ఎస్సై టి.శ్రీరాం పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement