Wednesday, May 29, 2024

Kedarnath : హెలికాప్టర్ కు తప్పిన పెను ప్రమాదం

ఉత్తరాఖండ్ లోని బాబా కేదార్నాథ్ ధామ్ వద్ద ఈ ఉదయం పెను ప్రమాదం తప్పింది. కొంతమంది భక్తులు కూర్చున్న హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. హెలికాప్టర్ లో ఉన్న వారంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ చుక్కాని దెబ్బతింది. దీంతో హెలికాప్టర్ ను ఎక్కువ దూరం తీసుకెళ్లలేకపోయారు.

అయితే, సమీపంలో హెలిప్యాడ్ ఉంది. అప్పుడు పైలట్ తెలివిగా ఖాళీ స్థలం కోసం వెతికాడు. అనంతరం హెలికాప్టర్ ను అక్కడ సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయితే అక్కడికి కొద్ది దూరంలోనే గుంట ఉంది. ఈ సమయంలో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో యాత్రికులు ఊపిరి పీల్చుకున్నారు. భక్తులు కూడా పైలట్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హెలికాప్టర్ లోని సాంకేతిక లోపాలను పైల‌ట్ ముందే చెక్ చేసి ఉండాల్సిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేదార్నాథ్ లో హెలికాప్టర్ సేవ ఎప్పుడూ ప్రమాదకరమే. కేదార్నాథ్ లో గత 11 ఏళ్లలో 10 ప్రమాదాలు జరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement