Wednesday, May 29, 2024

MBNR: కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త దాడి

అచ్చంపేట రూరల్, మే 24 : కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త సుంకరి బాలరాజు ఆయన సోదరుడు సుంకరి లింగం కాంగ్రెస్ కార్యకర్తలపై కత్తితో దాడిచేసిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో శుక్రవారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ విషయంపై మాటువేసుకొని ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు సుంకరి బాలరాజు, సుంకరి లింగం, శనివారం అచ్చంపేట పట్టణంలో సాయిరాం థియేటర్ ముందు ప్రధాన రోడ్డుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన లాలు యాదవ్, ఆంజనేయులు యాదవ్ నిల్చోని ఉన్న సందర్భంలో వెనకాల నుండి కత్తితో దాడి చేయడం జరిగింది.

ఈ దాడిలో లాలు యాదవ్ తలపై బలమైన గాయమైంది. వీపుపై గాయాలయ్యాయని బాధితులు తెలిపారు. అదేవిధంగా కాలుకు బలంగా గాయమైందని తెలిపారు. వీరిని వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయంపై పోలీసులకు వివరణ కోరగా దర్యాప్తు చేసి విచారణ చేస్తామని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement