Saturday, May 18, 2024

అట్టాంటిట్టాంటి దాన్ని కాదు మావో..

కిరణ్‌ అబ్బవరం హీరోగా కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న చిత్రం నేను మీకు బాగా కావాల్సినవాడిని. శ్రీధర్‌ గాదె దర్శకుడు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాజావారి రాణిగారు, ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం, సమ్మతమే లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్‌ అబ్బవరం.. ఇందులో చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది.ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి మరో మాస్‌ నెంబర్‌ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. నేను అట్టాంటిట్టాంటి దాన్ని కాదు మావో.. నీకు చెమటలు పట్టించుకోని పోను మామో.. అంటూ సాగే ఈ లిరికల్‌ సాంగ్‌కు ప్రేక్షకుల నుండి స్పందన లభిస్తోంది. పాటలో బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాలోని ‘చిలకపచ్చ కోక’, అలాగే అన్నయ్య సినిమాలోని ‘ఆట కావాలా పాట కావాలా’ పాటలకు కూడా డాన్స్‌ చేసి మెప్పించారు కిరణ్‌ అబ్బవరం. ఇది ఈ మాస్‌ నెంబర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంట్టంనర్‌గా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా వస్తోంది. సినిమాను సెప్టెంబర్‌ 9న విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement