Thursday, May 9, 2024

నాలుగు భాషల్లో.. “అధర్వ”

కార్తీక్‌ రాజు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త సినిమా అధర్వ. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో తీస్తున్నారు. మ‌హేష్‌ రెడ్డి దర్శకుడు. సుభాష్‌ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా మాస్‌ మహారాజా రవితేజ చేతులు మీదుగా ఈ సినిమా తెలుగు టైటిల్‌ లోగో, మోషన్‌ పోస్టర్‌ విడుదల చేశారు. నేను నమ్మిన సత్యం, వెతికే లక్ష్యం, దొరకాల్సిన సాక్ష్యం చేధించేవరకు ఈ కేసును వదిలిపెట్టను సార్‌.. అంటూ హీరో చెబుతున్న డైలాగ్స్‌ ఈ మోషన్‌ పోస్టర్‌ లో హైలైట్‌ అయ్యాయి. ది సీకర్‌ ఆఫ్‌ ది ట్రూత్‌ అనే ట్యాగ్‌ లైన్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఇప్పటివరకు వచ్చిన క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలతో పోల్చితే ఈ సినిమా డిఫరెంట్‌ అనుభూతి కలిగిస్తుందని తాజాగా వదిలిన మోషన్‌ పోస్టర్‌ స్పష్టం చేస్తోంది. అదేవిధంగా డీజే టిల్లు, మేజర్‌ లాంటి సినిమాలకు మ్యూజిక్‌ అందించిన శ్రీచరణ్‌ పాకాల ఈ సినిమాకు బాణీలు కట్టడం విశేషం. ఆయన మ్యూజిక్‌ సినిమాకు మేజర్‌ అసెట్‌ అంటున్నారు మేకర్స్‌. ఈ సినిమాకు చరణ్‌ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్రంలో సిమ్రాన్‌ చౌదరి, ఐరా, అరవింద్‌ కృష్ణ, కబీర్‌ సింగ్‌ దుహాన్‌, కల్పిక గణేష్, గగన్‌ విహారి, రామ్‌ మిట్టకంటి, కిరణ్‌ మచ్చ, మరిముత్తు, ఆనంద్‌, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement