Sunday, April 28, 2024

గెలాక్సీ వాచ్‌5 సీరీస్‌, బడ్స్‌2 ప్రోలను ప్రకటిస్తున్న శాంసంగ్‌

ప్రభ న్యూస్ : శాంసంగ్‌ కొత్త గెలాక్సీ వాచ్‌5 ప్రో, వాచ్‌5 అండ్‌ బడ్స్‌2 ప్రో లను ముందస్తుగా-బుక్‌ చేసుకునే వినియోగదారులు అద్భుతమైన ఆఫర్లకు అర్హులుగా ఉంటారు. వాచ్‌5 ప్రో అండ్‌ వాచ్‌5 శాంసంగ్‌ విశిష్టమైన బయో యాక్టివ్‌ సెన్సార్‌ తో వస్తాయి. అది హార్ట్‌ రేట్‌, బ్లడ్‌ ఆక్సిజెన్‌ లెవెల్‌ అండ్‌ ఒత్తిడి స్థాయి వంటి విస్తృతమైన రీడింగులను చూడడానికై ఒక సింగిల్‌ చిప్‌ని ఉపయోగిస్తుంది.

గెలాక్సీ వాచ్‌5 సీరీస్‌ స్లీప్‌ స్కోర్ల ద్వారా గురక గుర్తింపు, బ్లడ్‌ ఆక్సిజెన్‌ లెవెల్స్‌తో సహా నిద్రించు పోకడలను కూడా అర్థం చేసుకుంటుంది. నిద్ర దశలను పర్యవేక్షిస్తుంది. అధునాతనమైన, వ్యక్తిగతీకృతమైన నిద్ర తర్ఫీదుతో నిద్రించు అలవాట్లను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అదనంగా మీరు గనక బెడ్‌ నుండి పడిపోతే లేదా ఇంట్లో తడబడితే మీ అత్యవసర పరిచయస్థులకు తెలియజేసేలా ఫాల్‌ డిటెక్షన్‌ చూసుకుంటుందని శాంసంగ్‌ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement