Thursday, March 28, 2024

వివోస్లిమ్‌ అండ్‌ స్టైలిష్‌.. వై35 స్మార్ట్‌ఫోన్‌ విడుదల

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : ‘వివో సృజనాత్మక గ్లోబల్‌ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌. భారతదేశంలో వై 35 ఆవిష్కరణతో తన వై సిరీస్‌ పోర్ట్‌ ఫోలియోను విస్తరించింది. ఇందులో స్నాప్‌ డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌, 44వాట్‌ ప్లాష్‌ ఛార్జ్‌తో కూడిన 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 8జీబీ ర్యామ్‌, 50 మెగాపిక్సెల్‌ సూపర్‌ నైట్‌ కెమెరా సెటప్‌తో ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (ఈఐఎస్‌) ఉన్నాయి. 8జీబీ ప్లస్‌ 128 జీబీ వేరియంట్‌ ధర రూ.18,499లు ఉంటుందని, వివో వై35 వివో ఇండియా ఈ స్టోర్‌లో అన్ని భాగస్వామ్య రిటైల్‌ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ తెలిపింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ అగేట్‌ బ్లాక్‌ అండ్‌ డాన్‌ గోల్డ్‌తో సహా రెండు రంగుల వేరియంట్లలో లభిస్తుందని తెలిపింది. ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు 2022 సెప్టెంబర్‌ 30వరకు (ఐసీఐసీఐ/ఎస్‌బీఐ/ కొటక్‌/ వన్‌కార్డ్‌) ఉపయోగించి వివో వై35 కొనుగోలుపై రూ.వెయ్యి క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చని ఆసంస్థ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement