Saturday, April 27, 2024

టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ @రవితేజ ?

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమా చేస్తున్నాడు. అలాగే శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉండగా మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. స్టువర్టుపురం కి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ సినిమాగా తీయాలని నిర్మాత అభిషేక్ అగర్వాల్ గత కొంత కాలం గా ప్లాన్ చేస్తున్నాడు.

అయితే మొదట బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఈ సినిమా చేయాలని భావించినప్పటికీ ఇప్పుడు ఆ కథ రవితేజకు కు చేరిందట. కాగా రవితేజ కు కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు వంశీకృష్ణ నాయుడు దర్శకత్వం వహించనున్నారట. పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement