Saturday, May 4, 2024

ఈ వరుడు ఆమెకు వరుడును చూస్తాడట!!

హీరో నాగ శౌర్య గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు నాగశౌర్య. అయితే నాగశౌర్య ఇప్పటివరకు తన కెరీర్ లో ఇద్దరు లేడీ దర్శకులతో పని చేశారు. అందులో ఒకరు నందినీరెడ్డి… కాగా ఇంకొకరు లక్ష్మీ సౌజన్య. అయితే దర్శకురాలు లక్ష్మీ సౌజన్య తో ఉన్న ఓ ఫోటోను నాగశౌర్య తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సినిమా షూటింగ్ ముగిసిన సందర్భంగా దిగిన ఫోటో ఇది.

ఇప్పుడు ఈ వరుడు తన సోదరి లక్ష్మీ సౌజన్య కు వరుడుని చూసే పనిలో ఉన్నాడు అని కామెంట్ పెట్టాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక వరుడు కావలెను సినిమాలో నాగ శౌర్య సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement