Wednesday, May 1, 2024

సింగిల్ షెడ్యూల్ లో సినిమా కంప్లీట్…!!

కాజల్ అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. దశాబ్దకాలానికి పైగా హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తోంది. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలో కూడా వరుస సినిమాలు చేస్తుంది.

తాజాగా ఈమె ఉమ అనే హిందీ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసింది. తథాగత సింఘా దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయమవుతున్నారు. అలాగే అవికేష్ ఘోష్ నిర్మాత వ్యవహరిస్తున్నారు. తెలుగు విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాల్లో కూడా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement