Thursday, May 2, 2024

ర‌ష్మిక మంచి ఫ్రెండ్.. నో డేటింగ్.. బెల్లంకొండ శ్రీనివాస్

హీరోయిన్ ర‌ష్మిక‌తో మంచి స్నేహం ఉంద‌ని..అంత‌మాత్రానికే డేటింగ్ అని రాసేస్తారా అని మండిప‌డ్డాడు టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్..షూటింగ్ పనిపై ముంబైకి వెళ్లినప్పుడు ఎయిర్ పోర్ట్ లో కలుసుకుంటూ ఉంటామని, అలా అనుకోకుండా కలుసుకున్న సందర్భాలు కూడా తక్కువే అన్నారు. అంతమాత్రానికే ఇలాంటి వార్తలు రాసేస్తారా అని ప్రశ్నించారు. అవన్నీ పుకార్లేనని, వాటిని నమ్మవద్దని బెల్లంకొండ క్లారిటీ ఇచ్చారు. వివి వినాయక్ డైరెక్షన్ లో.. ఛత్రపతి సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసిన టీమ్.. ఈమూవీ ప్రమోషన్స్ పై గట్టిగా దృష్టి పెట్టింది. ఇక ఈసినిమాకు సంబంధించి వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు యంగ్ హీరో.. కాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నతో మీరు డేటింగ్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తలపై ఏమంటారు అని అడగగా..హీరో బెల్లంకొండ శ్రీనివాస్ స్పందించారు. ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు. నిజా నిజాలు తెలుసుకోకుండా ఎలా రాయగలుగుతారు అని మండిప‌డ్డారు. రష్మిక మందన్నతో తాను డేటింగ్ లో ఉన్నాను అన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement