Thursday, May 2, 2024

రామ్ స్టార్ట్ చేయబోతున్నాడు!!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇటీవల రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ గా కృతి శెట్టి నటించనుంది. అయితే ఇటీవల నిర్మాత జ్ఞానవేల్ లింగుస్వామి వివాదం తెరపైకి రావడంతో ఈ సినిమా ఆగిపోతుందనే మాట తెరపైకి వచ్చింది.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి సారథి స్టూడియోలో ఒక సాంగ్ షూటింగ్ తో షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారట. ఒక ప్రత్యేకమైన సెట్ లో ఈ పాటను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఈ పాటలో రామ్ తో పాటు కృతి కూడా పాల్గొనబోతున్నారట. అలాగే ఈ సినిమాకు దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement