Monday, April 29, 2024

బర్త్ డే స్పెషల్…. రాజ్ తరుణ్ కొత్త సినిమా అనౌన్స్

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. కెరీర్ ప్రారంభంలో ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ చిత్రాలు మినహా ఒక్క హిట్ కూడా తగల్లేదు. లవ్ ,కామెడీ, రొమాన్స్ థ్రిల్లర్ ఇలా ప్రతి జోనర్ లోనూ ట్రై చేస్తున్నాడు రాజ్ తరుణ్. ఇక ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా స్టాండప్ రాహుల్ అనే కొత్త సినిమా తెరకెక్కుతోంది. అలాగే కూర్చుంది చాలు అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు.

ఇక ఈ రోజు రాజ్ తరుణ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ పోస్టర్ ని చూస్తుంటే రాజ్ తరుణ్ నవ్వుతూ సైడ్ యాంగిల్ జనాల మధ్య నిలబడి మైకు పట్టుకుని మాట్లాడుతున్నట్లుగా డిజైన్ చేశారు. ఇక ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే కంచరపాలెం ఫేమ్ స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement