Monday, May 6, 2024

పుష్ప లిరికల్ వీడియో సాంగ్…వచ్చేస్తుంది!!

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ స్టార్ నటుడు గా ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ లిరికల్ వీడియోను వదలడానికి దర్శక నిర్మాతలు రెడీ అవుతున్నారట. అయితే అందుకు సంబంధించి ముహూర్తాన్ని ఇంకా ఫిక్స్ చేసుకోలేదట. కానీ త్వరలోనే ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ రాబోతుందట. మరి చూడాలి అది ఎప్పుడు వస్తుందో ఎలా ఉంటుందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement