Sunday, May 19, 2024

Manushi Chiller: పొట్టి గౌన్ లో పెద్ద పాప

వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న ‘ఆప‌రేష‌న్ వేలెంటైన్‌’లో న‌టించింది మాజీ మిస్సు మానుషి చిల్ల‌ర్. ఆ సినిమా త‌న‌కు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని అందించింది. మానుషి కెరీర్ లో మొద‌టి విజ‌యంగా కూడా దీనిని చెప్పొచ్చు. 2018లో మిస్ వ‌ర‌ల్డ్ అయిన మానుషి ఆ త‌ర్వాత బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించినా కానీ అక్క‌డ అదృష్టం క‌లిసి రాలేదు. ఏ ఒక్క‌టీ వ‌ర్క‌వుట్ కాలేదు.

స‌మ్రాట్ పృథ్వీరాజ్, ది గ్రేట్ ఇండియ‌న్ ఫ్యామిలీ పెద్ద ఫ్లాపుల‌య్యాయి. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న లేటెస్ట్ మూవీ కూడా త‌న ఆశ‌ల్ని అడియాస‌లే చేసింది. ఇటీవ‌లే విడుద‌లైన బ‌డే మియాన్ చోటే మియాన్ అతి పెద్ద డిజాస్ట‌రైంది. త‌దుప‌రి టెహ్రాన్ అనే చిత్రంలో న‌టిస్తోంది. ప్ర‌స్తుతానికి ఈ సినిమాపైనే త‌న హోప్స్ అన్నీ. మ‌రోవైపు మానుషి లైమ్ లైట్ నుంచి దూరం కాకుండా నిరంత‌రం ఫోటోషూట్ల‌తో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది.

- Advertisement -

ఇన్ స్టా వేదిక‌గా మానుషి షేర్ చేస్తున్న వ‌రుస ఫోటోషూట్లు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. తాజాగా మానుషి షేర్ చేసిన ఓ స్పెష‌ల్ ఫోటోషూట్ వెబ్ లో వైర‌ల్ గా మారింది. ఇందులో పొట్టి ప‌రికిణీలో ఎంతో వైబ్రేంట్ గా క‌నిపిస్తోంది ఈ బ్యూటీ. త‌న‌వైన‌ దేహ‌శిరుల్ని అల్లుకున్న ఫ్లోర‌ల్ బ్లాక్ డిజైన‌ర్ శాటిన్ గౌన్ ఎంతో ఒద్దిక‌గా కుదిరింది. మానుషి హాట్ నెస్ ని ఈ గౌన్ ఎలివేట్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement