Wednesday, May 15, 2024

ఒక్క బైకుపై 130 చలాన్లు.. నివ్వెరపోయిన ట్రాఫిక్ పోలీసులు

హైద‌రాబాద్‌లో ఓ వాహ‌న‌దారుడు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలో తనకు తానే ఘనుడిని అనిపించుకున్నాడు. తాజాగా జ‌రిగిన‌ పోలీసుల వాహనాల త‌నిఖీల్లో అత‌ని బైక్ నెంబ‌ర్‌పై ఉన్న వివ‌రాల‌ను చెక్‌చేయ‌గా.. ట్రాఫిక్ పోలీసుల బుర్ర తిరిగిపోయింది. మామూలుగా వాహ‌నదారులు ఎంత త‌ప్పించుకున్నా 10 లేదా 20 ఉల్లంఘ‌న‌ల త‌ర్వాత అయినా.. ఎక్క‌డో ఒక చోట దొరికిపోతారు. కానీ ఆ వ్య‌క్తి వాహ‌నంపై ఏకంగా 130 చ‌లాన్లను చూసి ట్రాఫిక్ సిబ్బంది నివ్వెర‌పోయారు.

జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులకు ఈ అనుభ‌వం ఎదురైంది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వ‌ద్ద త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో వెంకటగిరి వైపు నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్ నెం. 2 వైపు బైక్‌పై వస్తున్న వ్య‌క్తిని ఆపి.. అత‌ని వాహ‌నంపై ఉన్న చ‌లాన్ల‌ను ప‌రిశీలించారు. టీఎస్‌10 ఈఆర్‌ 7069 నెంబర్‌తో ఉన్న‌ ఈ వాహనంపై 2017 నుంచి ఇప్ప‌టిదాకా 130 చలాన్లు ఉన్నట్టు గుర్తించారు. ఓవ‌ర్ స్పీడ్, రాంగ్‌ పార్కింగ్‌, హెల్మెట్ లేక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో అనేక సార్లు ట్రాఫిక్, అలాగే సీసీ కెమెరాల‌కు చిక్కాడు. ఈ చ‌లాన్ల‌ మొత్తం విలువ‌ రూ.35,950 వ‌ర‌కు ఉన్న‌ట్టు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. పైన్ చెల్లించాల‌ని అడ‌గ్గా.. అత‌డు నిరాక‌రించాడు. దీంతో వాహ‌నాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: ఆ జిల్లాలో సెల్ఫీలపై నిషేధం.. ఉల్లంఘిస్తే జైలు శిక్ష

Advertisement

తాజా వార్తలు

Advertisement