Tuesday, July 23, 2024

Election Campaign – ఒడిశా ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఒరిస్సా రాష్ట్రంలోని బోలంగిర్ లోక్ సభ పరిధిలో నేడు ప్రచారం నిర్వహించనున్నారు. , ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీతో కలిసి ప్రత్యేక విమానంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బొలంగిర్ లోక్ సభ స్థానానికి చేరుకోనున్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే ఒరిస్సా రాష్ట్రంలో మూడు దఫాలుగా ప్రచారం నిర్వహించారు. కటక్ లో ఒకరోజు, భువనేశ్వర్ లో రెండు రోజులపాటు, రాయగడ పార్లమెంటు పరిధిలో రెండు రోజులపాటు ప్రచారం నిర్వహించారు. తాజాగా నాలుగోసారి ఒరిస్సా రాష్ట్రంలోని బోలంగిర్ పార్లమెంటు పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement