Saturday, June 12, 2021

భార్య-భర్తలు ఎక్కువగా మాట్లాడుకోకండి: పూరి జగన్నాథ్..

దంపతులు మధ్య విభేదాలు వచ్చినప్పుడు విడాకుల వ‌ర‌కు వెళ్ల‌కుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పారు దర్శకుడు పూరీ జ‌గ‌న్నాథ్‌. పాండ‌మిక్ త‌ర్వాత చాలా మంది విడాకుల కోసం ట్రై చేస్తున్నారని ఆయన అన్నారు. లాక్‌డౌన్ వ‌ల‌న మ‌గవాళ్లు, ఆడ‌వాళ్లు ఇంట్లోనే ఉండ‌డం వ‌ల‌న ఎక్కువ గొడ‌వ‌లు అయి విడాకులు తీసుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యధిక విడాకులు ఈ కరోనా సమయంలోనే అయ్యాయి” అంటూ పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు. గత సంవత్సరం లాక్ డౌన్ నుంచి ఇప్పటిదాకా రోజుకు 25 విడాకుల కేసులు ఫైల్ అవుతున్నాయట‌. గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌,ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లు విడాకులు తీసుకుంటున్న రాష్ట్రాల‌లో టాప్ 3గా ఉన్నాయి. అయితే భార్య భ‌ర్త‌ల బంధం విడాకుల వ‌ర‌కు వెళ్ల‌కుండా ఉండాలి అంటూ దంప‌తులు ఒక‌రితో ఒక‌రు త‌క్కువ స‌మ‌యం గ‌డ‌పండి. ఎక్కువ‌గా మాట్లాడుకోకండి, వివాహ బంధాన్ని నిలుపుకోండి అని విలువైన స‌ల‌హా ఇచ్చాడు. అంతేకాదు పెళ్లికి ముందు ఒంట‌రిత‌నం అనుభూతి చెందిన‌ట్ల‌యితే పెళ్లి చేసుకోవద్దంటున్నాడు. పెళ్లి త‌ర్వాత కూడా అలానే అనిపిస్తుంద‌ని పూరీ స్ప‌ష్టం చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Prabha News