Sunday, April 28, 2024

పవన్ బర్త్ డే స్పెషల్ రెడీ అవుతోందట!!

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కొషియమ్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక ఇందులో భీమ్లా నాయక్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఇక నిత్యమీనన్ పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట చిత్ర యూనిట్. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా… మాటలు, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement