Saturday, April 27, 2024

పుష్ప సౌండ్ ఇంజనీర్ గా ఆస్కార్ విన్నర్

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ప్రధానపాత్రలో సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ నటుడు ఫాహద్ విలన్ గా నటిస్తున్నారు. అంతేకాదు మరోవైపు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన టెక్నీషియన్స్ కూడా ఈ సినిమాకు పనిచేస్తుండటం విశేషం.

ఈ సినిమాకి ఆస్కార్ పురస్కార గ్రహీత ,ప్రముఖ సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి పని చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మేర ఓ పోస్టర్ ని కూడా విడుదల చేసింది. రసూల్ పూకుట్టి కి స్వాగతం అంటూ నిర్మాణ సంస్థ చెప్పుకొచ్చింది. సినిమా మొత్తం అడవుల్లో జరుగుతున్న నేపథ్యంలో సౌండ్స్ కు ఉన్న ప్రాధాన్యతను బట్టి రసూల్ పూకుట్టిని తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య 2 చిత్రానికి కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రెండు సినిమాలకు సంబంధించిన పాటలు కూడా మంచి సక్సెస్ ను సాధించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement