Sunday, April 11, 2021

‘జాతి రత్నాలు’ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘జాతిరత్నాలు’. మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ లాక్ డౌన్ తర్వాత విడుదలైన అన్ని సినిమాల కలెక్షన్స్‌ను తుడిచిపెట్టింది. ఓవర్సీస్‌లోనూ అద్భుతమైన వసూళ్లను సాధించింది. బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ విడుదల తేదీని ప్రకటించింది. ఈనెల 11 నుంచి ‘జాతి రత్నాలు’ మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో ఆకట్టుకున్న హీరో నవీన్ పొలిశెట్టి ఈ సినిమాతో ఇంకా మంచి క్రేజ్ సంపాదించుకుని మంచి ఆఫర్లను బుట్టలో వేసుకుంటున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Prabha News