Sunday, May 5, 2024

OMG 2 ఫైన‌ల్ ట్రైల‌ర్ రిలీజ్….

YouTube video

అక్షయ్ కుమార్ , పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో 2012 లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా OMG (Oh My God). దేవుడిని నమ్మని పరేష్ కోర్టులో దేవుడి మీద కేసు వేయడం, తనకి రక్షణగా శ్రీకృష్ణుడు అక్షయ్ గా రావడం స్టోరీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆ సినిమా మంచి విజయం అందుకుంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ లో వెంకటేష్ అండ్ పవన్ కల్యా ణ్.. ‘గోపాల గోపాల’గా రీమేక్ కూడా చేశారు… తాజాగా ఆ మూవీకి సీక్వెల్ గా OMG 2ని తీసుకు వస్తున్నారు. 11న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ట్రైలర్ ని నేడు విడుద‌ల చేశారు మేకర్స్.

ఈ సీక్వెల్ లో అక్షయ్ శివుడిగా కనిపించబోతున్నాడని ముందు నుంచి వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ట్రైలర్ మాత్రం అక్షయ్ శివుడి పంపించిన ‘దేవుని దూత’గా చూపించారు.. ఇక 27 క‌ట్స్ తో ఈ మూవీకి ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు.. కాగా ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, ‘రామాయణ్’ ఫేమ్ అరుణ్ గోవిల్ ప్రధాన పాత్రలు క‌నిపించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement