Thursday, May 2, 2024

నేటి నుండే ఓజీ షూట్.. మ‌హాబ‌లేశ్వ‌ర్ లో సాంగ్

యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఓజీ. ఈ చిత్రంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్నారు. ఆయ‌న‌కి జోడీగా ప్రియాంక ఆరుళ్ న‌టిస్తోంది.కాగా ఓజీ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. మంగళవారం మహాబలేశ్వర్‌లో పవన్‌ కళ్యాణ్, ప్రియాంకల మీద పాట షూటింగ్‌ను స్టార్ట్‌ చేయబోతున్నారట. మూడు రోజుల షెడ్యూల్‌లో ఈ పాటను ఫినీష్‌ చేయనున్నారట. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి ఇండస్ట్రీ హిట్‌ను నిర్మించిన దానయ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా కోసం పవన్‌ 60రోజుల కాల్షీట్లు ఇచ్చాడని తెలుస్తుంది. ఇక ఈ ఏడాది చివరి కల్లా టాకీ పార్ట్‌ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలిని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement