Friday, April 26, 2024

నిండు మనసుతో శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు…యంగ్ టైగర్

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు మూడు రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో హంగామా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అభిమానులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఎన్టీఆర్ కు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పారు. అలాగే ఎన్టీఆర్ ఆరోగ్యంగా ఉండాలని… కరోనా కోలుకోవాలని నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తూ పెద్దలు ట్వీట్లు చేశారు.

అయితే అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్టీఆర్ ఓ ట్వీట్ చేశారు. నిండు మనసుతో నాకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, చిత్ర పరిశ్రమ సభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement