Thursday, March 28, 2024

కేసీఆర్ గాంధీ ఆసుపత్రి సందర్శన ఒక పబ్లిసిటీ స్టంట్: బండి

కేసీఆర్ గాంధీ ఆసుపత్రి సందర్శన ఒక పబ్లిసిటీ స్టంట్ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అభివర్ణించారు. రాకరాక సీఎం కేసీఆర్ బయటికి వచ్చేసరికి అందరికీ అదొక వింతలా ఉందని వ్యాఖ్యానించారు. ఏడేళ్ల పాలనలో తొలిసారి బయటికి వచ్చి అదేదో గొప్ప విషయంగా చెప్పుకుంటున్నారని, ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉండదని పేర్కొన్నారు. గతంలో సీఎంగా చేసిన వారు వారానికోసారైనా ప్రజల సమస్యలు తెలుసుకునేవారని, ఆ పద్ధతికి దూరంగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. అలాంటి సీఎం ఏడేళ్ల తర్వాత బయటికి వచ్చేసరికి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. గంట పాటు పర్యటించాడు… ఇక ఏడేళ్లపాటు పబ్లిసిటీ చేసుకోండి అంటూ ధ్వజమెత్తారు. మళ్లీ ఫాంహౌస్ కు వెళ్లాడంటే మూడేళ్లు ఇక బయటికి రాడని విమర్శించారు. ఎన్నికల ప్రచారం అప్పుడు కూడా బయటికి రాని కేసీఆర్.. నిన్న బయటికొచ్చాడు… విపరీతమైన పబ్లిసిటీ చేసుకుంటున్నారని  విమర్శించారు.  సీఎం కేసీఆర్ గాంధీకి వెళ్లడం పట్ల చాలా సంతోషిస్తున్నామన్నారు. గాంధీకి వెళ్లి సీఎం కేసీఆర్ ఎం సాధించారు ? ప్రశ్నించారు. కేసీఆర్‌ గాంధీ ఆసుపత్రికి ఒక్కసారి వెళ్తే కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఏడు సార్లు వెళ్లి వచ్చారని తెలిపారు. వరంగల్‌ ఎంజీఎంకు ఈరోజే ఎందుకు వెళ్లడం లేదని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement